కేటీఆర్‌కు ‘చిరుత’ సవాల్‌..

315
- Advertisement -

కథానాయకుడు రామ్‌చరణ్‌ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, మెగాస్టార్‌ చిరంజీవికు సవాలు విసిరారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పని సరి అంటూ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్ మొద‌లు పెట్టిన ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్’ ఛాలెంజ్ కి దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. రాజకీయ నాయకులూ, సినీ తారలు, సామాన్యులు, క్రీడాకారులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని వారు చేస్తున్న వ్యాయమ వీడియోలను ఇతరులకు ట్యాగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Ram charan

ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా తమ ఫిట్‌నెస్‌ వీడియోలను పంచుకున్నారు. తమ స్నేహితులకు, సహ నటులకు ఛాలెంజ్‌ విసిరారు. వరుణ్‌ ధావన్‌, నాగార్జున, అఖిల్‌, తారక్‌, కల్యాణ్‌రామ్‌, సమంత, నాగచైతన్య, సుశాంత్‌, సానియా మీర్జా, సాయేషా తదితరులు ఫిట్‌నెస్‌ వీడియోలను పోస్ట్‌ చేశారు.

ఇటీవల తారక్‌ తన స్నేహితుడు రామ్‌చరణ్‌కు సవాల్‌ విసిరాడు. అయితే తారక్‌ విసిరినా సవాలును రామ్‌ చరణ్‌ స్వీక‌రించారు. దీనికి సంబందించిన ఫిట్‌నెస్ వీడియోని త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘హేయ్ ఎన్టీఆర్‌ అన్న.. నీ సవాలును స్వీకరించా. సుకుమార్‌, కేటీఆర్‌, సందీప్‌ కోశ్లా, శోభనా కామినేని, వరుణ్‌తేజ్‌, మన మెగాస్టార్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నా’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

- Advertisement -