మొక్కలు నాటడం ఆనందంగా ఉంది :కోరుకంటి చందర్‌

99
korukanti chandar
- Advertisement -

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ్ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. రోజురోజు ప్రముఖులు మొక్కలు నాటి వాటి వల్ల జరిగే లాభాలను ప్రజలకు వివరిస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీ ధర్మశాస్ర్త ఆశ్రమంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్ని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ గ్రీనరిగా మారిందంటే అది కేవలం ఎంపీ సంతోష్‌కుమార్‌ చొరవ వల్లే. దీని కోసం ప్రభుత్వం నిరంతరంగా హరిత తెలంగాణ కార్యక్రమంను కొనసాగిస్తొందన్నారు. తెలంగాణ లో గ్రీనరి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమంను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆయన కోరుకున్నారు.

- Advertisement -