ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా ఎం శ్రీనివాస్‌

101
aiims
- Advertisement -

తెలంగాణకు చెందిన డాక్టర్‌ ఎం శ్రీనివాస్‌ను ఆల్‌ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కి కొత్త డైరెక్టర్‌గా నియమించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ నియామక కమిటీ(ఏసీసీ) శుక్రవారం నిర్ణయించింది. ఈయన సెప్టెంబర్‌ 23నాటికి అధికారిక ఉత్తర్వుల ప్రకారం నుంచి ఐదేళ్లు లేదా 65ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆసుపత్రి(ఈఎస్‌ఐసీ) మరియు మెడికల్‌ కాలేజీకి డీన్‌గా పని చేస్తున్నారు.

ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేస్తున్న డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మార్చి28, 2017 రోజున డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం గులేరియా నేటితో పదవీ విరమణ పొందగా తదుపరి ఎయిమ్స్‌ వారసుడిగా డాక్టర్‌ ఎం శ్రీనివాస్‌ను నియమించారు. అయితే ఈ పదవి కోసం పలువురు వైద్య నిపుణుల పేర్లను కూడా పరిశీలించారు. కానీ క్యాబినెట్‌ నియామక కమిటీ శ్రీనివాస్‌ను మాత్రము ఎంపిక చేసింది.

- Advertisement -