నేటి రెండు చిత్రాల పరిస్థితేంటి?

50
- Advertisement -

ఈ రోజు తెలుగు బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు పోటీ పడ్డాయి. డైరెక్ట్ తెలుగు సినిమా స్కందతో పాటు డబ్బింగ్ సినిమా చంద్రముఖి 2 కూడా రేసులో నిలిచింది. ఓపెనింగ్స్ పరంగా స్కంద బాగానే కలెక్ట్ చేసింది. అటు చంద్రముఖి 2 కూడా ఆశించిన స్థాయిలోనే కలెక్షన్స్ ను రాబడుతుంది. మరి రానున్న రోజుల్లో ఈ రెండు సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, ఇంతకీ.. ఈ రెండు సినిమాల టాక్ ఎలా ఉంది ?, ఏ సినిమాకి ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు ? చూద్దాం రండి. ముందుగా ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా విషయానికి వద్దాం.

భారీ అంచనాలతో ఈ రోజు స్కంద చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఈ చిత్రంలో రామ్ మాస్ లుక్ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఆకట్టుకుంటాయి. రామ్ డైలాగ్ డెలివరీ, శ్రీలీలతో రొమాన్స్, డ్యాన్స్ బాగున్నాయి. థమన్ మ్యూజిక్ హీట్ పుట్టిస్తుంది. కానీ, సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యింది. అసలు ఎక్కడా లాజిక్ కూడా లేకుండా ఈ సినిమా సాగింది. బోయపాటి తన పైత్యంతో సినిమాని చంపేశాడు అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓవరాల్ గా స్కంద మూవీ బ్యాడ్ టాక్ ఎక్కువగా వస్తోంది.

ఇక చంద్రముఖి 2 విషయానికి వస్తే.. లారెన్స్, పి. వాసు కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాకు కూడా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘డైరెక్టర్ పి. వాసు స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ అయ్యింది. కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. రజినీకాంత్‌ను అనుకరించకుండా లారెన్స్.. తన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. చంద్రముఖిగా కంగనా నటన పెద్దగా భయపెట్టలేకపోయింది. రాధిక, వడివేలు కామెడీ వర్కౌట్ కాలేదు. మొత్తానికి సినిమా ఆకట్టుకోలేదు అని అంటున్నారు. సో.. ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

- Advertisement -