Ram Pothineni:స్కంద ఓటీటీ డేట్ ఫిక్స్!

33
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ స్కంద. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలగా రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీని తోడు పాన్ ఇండియా లెవల్లో సినిమా రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లా పడింది.

ఇక ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి వచ్చేసింది. ఈ సమయంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ + హాట్ స్టార్‌ సొంతం చేసుకోగా అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Also Read:జిగర్ తండ డబుల్ ఎక్స్…సాంగ్ రిలీజ్

- Advertisement -