షార్ట్‌ ఫిల్మ్‌ తో సన్నీని సపోర్ట్‌ చేసిన వర్మ..

205
Ram Gopal Varma's Short Film MERI BETI SUNNY LEONE BANNA ..
- Advertisement -

రామ్‌గోపాల్ వర్మ..ఓ సంచలన దర్శకుడు. ఈయనకు మరో పేరు కూడా ఉంది..వివాదాలకు పెట్టింది పేరు రాంగోపాల్‌ వర్మ అని. వర్మ ఎక్కువగా తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడనేది వాస్తవం.

అయితే వర్మ ఏది చేసినా అది సంచలనమే. ఎప్పుడు ఎవరిమీద మాటల యుద్దం చేస్తాడో తెలీదు. తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడడం, ఆ తర్వాత సారీ లు చెప్పడం వర్మకు మాత్రమే సొంతం.
Ram Gopal Varma's Short Film MERI BETI SUNNY LEONE BANNA ..
ఇదిలా ఉంటే..తాజాగా మరో సంచలనానికి తెరలేపాడు వర్మ. ట్విట్టర్ వేదికగా ఎంతో మంది ప్రముఖులపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ ఇటీవలే ట్విట్టర్‌ నుంచి బయటకు వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. ట్విట్టర్‌ నుంచి బయటకు రావడమే తరువాయి.. ‘గన్స్ అండ్ థైస్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు.

అయితే వర్మ తాజాగా ఇప్పుడు సన్నీలియోన్‌ను సపోర్ట్ చేస్తూ ‘మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తి హై’ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌ను రిలీజ్ చేశారు. తన మొదటి షార్ట్‌ ఫిల్మ్ ఇదేనంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు వర్మ. సన్నీలియోన్‌లా అవ్వాలనుకుంటున్న ఓ యువతిని, ఆమె తల్లిదండ్రులు మందలిస్తారు. దీంతో ఆ యువతి వాళ్లకు దీటుగా జవాబిస్తుంది. అయితే, తాను సన్నీలియోన్ లా ఎందుకు కావాలనుకుంటోందో ఆమె వారికి వివరిస్తుంది.
50090145
పోర్న్ స్టార్ కావడం కూడా ఓ వృత్తే అనే విధంగా ఆమె చెబుతుంది. తమ వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ అమ్మాయిలకు ఇవ్వాలని చెప్పే ప్రయత్నాన్ని ఈ షార్ట్ ఫిలిం ద్వారా వర్మ చేశాడని చెబుతున్నారు.  వర్మ యాంగిల్‌లో ఇది కరెక్టే అయినా.. సభ్యసమాజం అంగీకరించని రీతిలో ఈ షార్ట్ ఫిల్మ్ ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ షార్ట్ ఫిల్మ్‌లో ఏముందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడాల్సిందే..

- Advertisement -