తమన్నావద్దు త్రిపాఠే ముద్దు..

325
Sukumar To Produce 100% Love Remake In Tamil
- Advertisement -

ద‌ర్శ‌కుడిగా మంచి ఇమేజ్ సంపాదించిన సుకుమార్.. ‘కుమారి 21 ఎఫ్‌’తో నిర్మాత‌గానూ మారాడు. పెద్ద స‌క్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దాని త‌ర్వాత త‌న అన్న కొడుకు అశోక్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ‘ద‌ర్శ‌కుడు’ అనే సినిమాను సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన తమిళంలో ఓ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. తెలుగులో తాను చేసి హిట్ కొట్టిన ‘100% లవ్’ సినిమాకి ఇది రీమేక్.

Sukumar To Produce 100% Love Remake In Tamil

‘జ‌గ‌డం’, ‘ఆర్య‌-2’ లాంటి ఫెయిల్యూర్ల త‌ర్వాత సుక్కును మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ‘100 ప‌ర్సంట్ ల‌వ్’. నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించింది. సుక్కు త‌న‌దైన శైలిలో ఈ ల‌వ్ స్టోరీని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలిచాడు. ‘100 ప‌ర్సంట్ ల‌వ్’ ఇప్ప‌టికే బెంగాలీలో రీమేక్ అయింది.

Sukumar To Produce 100% Love Remake In Tamil

చాలకాలంగా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన చంద్రమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. తెలుగులో చైతూ చేసిన పాత్ర కోసం తమిళంలో జీవీ ప్రకాశ్ ను తీసుకున్నారు. ఇక తెలుగులో తమన్నా చేసిన పాత్రలో ఆమెనే తీసుకునే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు .. తమన్నా ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

- Advertisement -