కాస్టింగ్ కౌచ్ పై అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి. ఇ వ్యవహారంపై స్సందించి ‘మా’ అసోసియేషన్ తనకు సభ్యత్వం ఇవ్వబోమని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందె. దీనిపై మానవ హాక్కుల సంఘం స్సందించడంతో ‘మా’ కాస్త వెనక్కి తగ్గుతూ.. లైంగికంగా వేధింపులకు గురవుతున్న మహిళల కోసం ‘మా’ అసోసియేషన్ కమిటీ అగైనెస్ట్ సెక్సువల్ పేరుతో తాజాగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ నేపధ్యంలో శ్రీరెడ్డి వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ మద్దతిచ్చాడు. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి స్త్రీలపై జరుగుతున్న అరాచాకాలను శ్రీరెడ్డి చేసిన పోరాటం చాలా గొప్పదని ఆయన ప్రసంశలు కురిపించారు. ఇదే విషయంపై తన పేసు బుక్‌లో పోస్టు చేస్తూ..వంద సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు స్సందించిన విషయాలను శ్రీరెడ్డి లేవనెత్తారు. అందుకు నేను ఆమెకు సెల్యూట్ చేస్తూన్న కాకపోతే అర్ధనగ్న ప్రదర్శనకు దిగడం తప్పే.. అలా చేస్తే గానీ జాతీయ, అంతర్జాతీయ సంఘాలు రంగంలోకి దిగలేదన్నారు.
ఆమెను చూసి తల్లి గర్వపడుతారు. చెప్పాలంటే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం కత్తిపట్టి ఎలా పోరాడారో ‘శ్రీ లక్ష్మీబాయి’ కూడా తన దేహంతో చిత్రపరిశ్రమలో పేరుకుపోయిన అరాచకాలపై పోరాడారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు వర్మ.