ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజి

199
65th National Film Awards announcement
- Advertisement -

65వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా రానా నటించిన ఘాజి ఎంపికైంది. రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం బాహుబలి 2కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.

ఈ మధ్యే చనిపోయిన శ్రీదేవికి మామ్ మూవీకిగాను ఉత్తమ నటి అవార్డు రావడం విశేషం. ఇక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు వినోద్ ఖన్నాను వరించింది. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు.

sridevi

బెస్ట్ యాక్ట్రెస్: శ్రీదేవి (మామ్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఘాజి
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: బాహుబలి 2
బెస్ట్ పాపులర్ ఫిల్మ్: బాహుబలి 2
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: బాహుబలి 2
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ : ఏఆర్ రెహమాన్ (కాట్రు వేలియిదాయ్)
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఏఆర్ రెహమాన్ (మామ్)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: యేసుదాస్
దాదా సాహెల్ ఫాల్కె అవార్డు: వినోద్ ఖన్నా
బెస్ట్ యాక్టర్: రిద్ధీ సేన్, నగర్ కిర్టాన్
బెస్ట్ డైరెక్టర్: జయరాజ్ (భయానకం, మలయాళం)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీస్)
బెస్ట్ హిందీ ఫిల్మ్: న్యూటన్
బెస్ట్ రీజినల్ ఫిల్మ్: లఢాఖ్

- Advertisement -