మీడియాను నిలదీసిన వర్మ…

329
ram gopal varma fires on media
- Advertisement -

రాంగోపాల్‌ వర్మ తీసిన జీఎస్‌స్టీ(గాడ్‌సెక్స్‌ అండ్‌ ట్రూత్‌) రీలీజ్‌ అయ్యాక కూడా ఆ డాక్యుమెంటరీ వివాదం వర్మాని వదల్లేదు. రీసెంట్‌గా సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు వర్మని విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణలో జీఎస్టీని అసలు తాను తీయలేదని వర్మ చెప్పాడంటూ కొన్ని ప్రముఖ మీడియా ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రియాక్ట్‌ అయ్యారు.

ఆ చిత్ర తెరకెక్కించిన ఘనత తనకే దక్కినప్పుడు.. అందులో తాను భాగస్వామిని కాలేదన్న విషయాన్ని ఎలా ప్రచురిస్తారంటూ మీడియాను నిలదీస్తున్నాడు వర్మ.

‘అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్న కొందరు గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ను అసలు తాను తీయలేదని.. కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించానని చెబుతున్నారు. సినిమా తెరెక్కించిన ఘనత నాదే అయినప్పుడు ఆ వార్తలను నేను ఖండించకుండా ఎలా ఉంటా?’ అని వర్మ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఈమేరకు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ఆయన పోస్ట్‌ చేశారు. కాగా, వర్మ తాను అసలు జీఎస్టీ తీయలేదని.. కేవలం స్క్రిప్టు మాత్రమే అందించానని విచారణలో వెల్లడించినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాయగా.. నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడంటూ మరికొన్ని కథనాలు ప్రచురించాయి.

‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ (జీఎస్టీ) వీడియో, మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు అందుకున్న వర్మ గత శనివారం సీసీఎస్‌ పోలీసుల ముందు హాజరయ్యాడు. సుమారు 3గంటలకు పైగా వర్మను విచారించిన పోలీసులు ల్యాప్‌ ట్యాప్‌, సెల్‌ ఫోన్‌ను సీజ్‌ చేసి మళ్లీ ఈ శుక్రవారం(23వ తేదీ) విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు.

- Advertisement -