వర్మకి విషెస్‌ చెప్తారా..? కాస్త ఆలోచించండి..

204
Ram Gopal Varma Birthday

వర్మ అంటే ఎప్పుడూ సంచలనమే. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు ఎవరిని పొడుగుతారో, ఎవరిమీద బురద జల్లుతారో తెలియదు. ఇక వర్మ తీసే ప్రతీ సినిమాలో తనదైన మార్కు కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు చాలా సినిమాలు నిజ జీవితాలకు దగ్గరగా తీస్తారు వర్మ.
ఆయన తీసే సినిమాలను చూడడం కోసం ఎదురుచూసే వారు చాలా మందే ఉన్నారు.
 Ram Gopal Varma Birthday
అయితే ఏ దర్శకుడు తీయలేని విధంగా సూపర్‌ ఫాస్ట్‌ గా ఆయన సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా ఉంటాయి. అయితే ఎంత ఫాస్ట్‌ గా వర్మ సినిమాలు రిలీజ్‌ అవుతాయో..అంతే ఫాస్ట్‌ గా థియేటర్‌ నుండి వెళ్ళిపోతాయనుకోండి..అది వేరే విషయం.

అయితే ఈ రోజు(ఏప్రిల్ 07) ఈ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పుట్టిన రోజు.ఇప్పటికే ప్రముఖ సెలెబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలందుకున్నారు వర్మ. ఇక  వర్మ విషయానికొస్తే.. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివే సమయంలో విపరీతంగా సినిమాలు చూసేవారట . దీంతో సినిమాలపై విపరీతమైన ఇష్టం ఏర్పడింది.
 Ram Gopal Varma Birthday
ఇక ఆ కసితోనే ‘శివ’ సినిమా తీసి సంచలనం క్రియేట్‌ చేశారు.‘శివ’ ఒక ట్రెండ్‌ సెట్టర్‌. సైకిల్‌ చైన్‌తో కొడితే బాక్సాఫీస్‌ బద్ధలైపోయింది. ఈ సినిమాతో తనదైన ముద్రవేసిన వర్మ ఆ తర్వాత ‘క్షణ క్షణం’ తీశారు. ఇక వర్మ టేకింగ్‌ స్టైల్‌కు చిత్ర పరిశ్రమ మరోసారి ఫిదా అయిపోయింది.

అంతేకాదు సినీ విశ్లేషకులు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమను ‘శివ’కు ముందు.. తర్వాత అంటూ విభజిస్తారు. అంతలా చెరగని ముద్రని సంపాధించకున్నారు వర్మ. అయితే ఎవరు ఎలా అనుకున్నా…వర్మ మాత్రం ‘నా ఇష్టం’ అనుకుంటూ..చెలరేగిపోతారు. ఇక వర్మ గురించి ఇలా చెప్పుకుంటూపోతే  చాలానే ఉన్నాయి. సో ఈ రోజు వర్మ పుట్టిన రోజు కాబట్టి..మేము వర్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలేదు. ఎందుకంటే..వర్మకి విషెస్‌ ,సెలెబ్రేషన్ప్‌ నచ్చవు. ఐనప్పటికీ శుభాకాంక్షలు చెప్తూనే ఉంటారు. ఎవరి అభిమానం వారిది మరి. ఇక ‘పుట్టిన రోజు’ని వర్మ ఎలా ఫీలౌతారో.. ఆయన ఫ్యాన్స్‌లో కొంతమంది కూడా అలాగే ఫీలౌతున్నారు. సో వర్మకి విషెస్‌ చెప్పాలంటే కాస్త ఆలోచించండి అంటున్నారు ఆయన ఫ్యాన్స్‌.