రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పటి నుండి తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో మహిళలను చూపించిన విధానంపై ముఖ్యంగా హీరోయిన్ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించడంపై పలువురు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత నడుమ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి థియేటర్లో సినిమా చూశారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి, అభిమానులతో కలిసి సినిమా చూశారు. సినిమా విడుదలైనప్పటి నుండి పెద్దగా పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వని చరణ్… ఎట్టకేలకు ఆదివారం నాడు థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో స్వయంగా చూసేందుకు బయటకు వచ్చారు.
మల్టీప్లెక్స్‌లోని హౌస్‌ఫుల్ స్క్రీనింగ్‌లో జాయిన్ అయిన చరణ్.. వెండితెరపై ‘పెద్ది’ చిత్రాన్ని చూస్తూ అభిమానులు చేస్తున్న హంగామాను, వారి ఉత్సాహాన్ని ఆస్వాదించారు. ఆయనతో పాటు దర్శకుడు బుచ్చిబాబు సన, నిర్మాత వెంకట సతీష్ కిలారు కూడా ఉన్నారు.
ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ‘పెద్ది’ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. ఇక బాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, దివ్యేందు మరియు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
Also Read:ఇరాన్-ఇజ్రాయెల్..బాంబుల మోత!

