ఇరాన్-ఇజ్రాయెల్..బాంబుల మోత!

5
- Advertisement -

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. బీరూట్, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా సోమవారం ఇరాన్ తన అతిపెద్ద క్షిపణి దాడుల్లో ఒకదాన్ని ప్రారంభించడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరోసారి ముదిరింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ సంక్షోభం ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీతో సహా ఆ దేశ అగ్రశ్రేణి నాయకత్వాన్ని మెజారిటీగా తుడిచిపెట్టేసింది. తాజా దాడులు మధ్యప్రాచ్యంలో వివాదాన్ని ముగించడానికి జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలను మరింత క్లిష్టం చేస్తాయని భావిస్తున్నారు.

ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ కనీసం మూడు విడతలుగా ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. టెల్ అవీవ్ స్పందిస్తూ.. (ఇరాన్ పెద్ద తప్పు చేసిందని….ఈ దాడులకు శక్తివంతమైన సమాధానం ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహును ప్రతీకారం తీర్చుకోవద్దు అని అభ్యర్థించారు.

నేను ఇప్పుడే బిబీకి (నెతన్యాహు) ఫోన్ చేసి ప్రతీకారం తీర్చుకోవద్దని చెప్పబోతున్నాను అని ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇజ్రాయెల్ తన దాడిని చేసింది….ఇరాన్ కూడా తన దాడిని చేసింది. మనకు ఇంకొక దాడి అవసరం లేదు అన్నారు.

ALso Read:#RAPO23లో సినిమాటోగ్రాఫర్ తిరు

ఇద్దరు వ్యక్తులు మరణించడానికి 20 మంది గాయపడటానికి కారణమైన ఇజ్రాయెల్ బీరూట్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ నుండి ఎదురుదాడి జరుగుతుందనే భయంతో ఇరాన్ ప్రస్తుతం తన వైమానిక విభాగాన్ని (ఎయిర్‌స్పేస్) మూసివేసింది. ఈ దురాక్రమణ చర్యలు మళ్లీ పునరావృతమైతే… మా ప్రతిస్పందనలు మరింత విస్తృతంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని అన్ని అమెరికన్, జియోనిస్ట్ (ఇజ్రాయెల్) లక్ష్యాలను మేము ముట్టడిస్తాము అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.

- Advertisement -