అరంగేట్రంలోనే చెలరేగిన సుతార్!

3
- Advertisement -

మానవ్ సుతార్ తన అంతర్జాతీయ కెరీర్‌ను కరెక్ట్ డ్రీమ్ స్టార్ట్‌తో ప్రారంభించాడు. తొలి ఓవర్ లోనే వికెట్, ఫస్ట్ మ్యాచ్ లోనే ఆరు వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. టీమిండియా తదుపరి టెస్ట్ క్యాప్‌ను ఎవరికి ఇస్తారనే దానిపై గౌతమ్ గంభీర్ ఉత్కంఠను కొనసాగించినప్పటికీ సుతార్ భారత్ తరఫున 319వ టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.

ఒక అరంగేట్ర ఆటగాడు ఇంతకంటే ఏం కోరుకుంటాడు? వేసిన మొదటి ఓవర్లోనే వికెట్ తీసి అంతర్జాతీయ వేదికపై తన రాకను ఘనంగా చాటాడు సుతార్. కొంచెం అదనపు బౌన్స్ అయిన స్ట్రెయిట్ డెలివరీతో అతను తన మొదటి వికెట్ సాధించాడు. ఆఫ్ఘన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్ ఆ బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించగా, అది గాల్లోకి లేచింది. సిరాజ్ దాన్ని సులువుగా క్యాచ్‌గా అందుకున్నాడు.

రహ్మానుల్లా గుర్బాజ్‌పై సుతార్ మరింత తెలివిగా బౌలింగ్ చేశాడు. కొన్ని స్ట్రెయిట్ బంతులను గుర్బాజ్ డిఫెండ్ చేసిన తర్వాత సుతార్ అదే స్పాట్ నుండి ఒక బంతిని వేశాడు. అది లేట్‌గా డిప్ అయి వెలుపలికి టర్న్ అవుతూ బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. సెకండ్ స్లిప్‌లో ఉన్న సాయి సుదర్శన్ ఆ క్యాచ్‌ను క్లీన్‌గా అందుకున్నాడు.
ఇలా సుతార్ అరంగేట్రంలోనే 6 వికెట్లు పడగొట్టి తానేంటో ప్రపంచానికి నిరూపించుకున్నాడు.

బంతితో ఆఫ్ఘన్లను ఇబ్బంది పెట్టడానికి ముందు సుతార్ లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో కూడా రాణించాడు. అతను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 41 బంతుల్లో 28 పరుగులు చేసి, భారత్ 564/8 స్కోరు సాధించడంలో తన వంతు సహకారం అందించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికే ఒక సెంచరీ సాధించిన సుతార్.. తాను ఇండియా టీమ్‌లోకి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వచ్చినప్పటికీ బ్యాట్‌తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలనని నిరూపించాడు.

Also Read:‘పెద్ది’ నాలుగో రోజు కలెక్షన్స్!

- Advertisement -