రామ్ చ‌ర‌ణ్ కు నో చెప్పిన ఇలియాన‌..

277
iliyana ram charan
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ విన‌య విధేయ రామ‌. ఈచిత్రంలో చ‌ర‌ణ్ మాస్ లుక్ లో క‌నిపించ‌నున్నాడు. డివివి దాన‌య్య ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను కూడా విడుద‌ల చేశారు. ఈటీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. సంక్రాంతి పండుగ కానుక‌గా ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర‌యూనిట్. ఈసినిమాలో వివేక్ ఒబేరాయ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్నాడు.

ram

భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ఇక ఈసినిమాకు మ‌రింత గ్లామ‌ర్ తీసుకువచ్చేందుకు మ‌రో హీరోయిన్ తో ఐట‌మ్ సాంగ్ చేపిందేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట చిత్ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు. అయితే అందుకు అనుగుణంగానే సినీయ‌ర్ హీరోయిన్ ఇలియానా ను సంప్ర‌దించారు చిత్ర‌బృందం.

vinaya videya rama

ఈసినిమాలో న‌టించినందుకు త‌నకు రూ.60ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింద‌ట ఇల్లి బేబి. దీంతో ఖంగుతిన్న నిర్మాత‌లు మ‌రో ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఒక్క సాంగ్ కోసం ఇలియాన అంత పెద్ద మొత్తంలో మ‌నీ డిమాండ్ చేయ‌డంపై టాలీవుడ్ లో చ‌ర్చించుకుంటున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -