సెన్సార్ పూర్తిచేసుకున్న ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’

258
subramanyapuram
- Advertisement -

హీరో సుమంత్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా జంటగా న‌టించిన సినిమా సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం. సంతోష్ జాగర్లపూడి ఈమూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. బీరం సుధాకర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం మూవీ సుమ‌న్ కెరీర్ లో 25వ సినిమా. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.

sumanth

అంతే కాకుండా ఈట్రైల‌ర విడుద‌ల చేసిన 24గంట‌ల్లోనే వ‌న్ మిలియ‌న్ వ్యూస్ ను రాబ‌ట్టింది. తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈమూవీకి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా డ్యూరేషన్ 132 నిమిషాలు.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన సుబ్రహ్మణ్యపురం చూసి, సెన్సార్ సభ్యులు పాజిటివ్‌గా స్పందించారట‌. డిసెంబర్ 7న సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టు తెలిపారు చిత్ర‌యూనిట్. ఈమూవీకి శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించారు.

- Advertisement -