నా భార్య వల్లే ఆ సినిమాలు చూస్తున్న-చెర్రీ

267
Ram Charan
- Advertisement -

టాలీవుడ్ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ రంగస్థలం మూవీతో బారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మెగా హీరోకు బయోపిక్ సినిమాలంటే చాలా ఇష్టమట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బయోపిక్‌లలో నిజాలు ఉంటాయని… అందుకే అవి తనకు నచ్చుతాయని చరణ్‌ తెలిపాడు.

అయితే, బయోపిక్ లో నటించే అవకాశం తనకు వస్తే ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో మాత్రం చెప్పలేనని అన్నాడు. తాజగా ‘సంజు’ సినిమా చూసిని చరణ్‌.. ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటన చాలా బాగా నచ్చిందని.. ఆయన గొప్ప యాక్టర్ అని కితాబిచ్చాడు.

Ram Charan

ఇక తన భార్య ఉపాసనకు గురించి మాట్లాడుతూ.. ఆమెకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టమని… ఆమె వల్లే తాను కామెడీ సినిమాలు చూస్తున్నానని… ఈ విషయంలో ఆమెకు థాక్ప్‌ చెప్పాలని రామ్‌ చరణ్ తెలిపాడు. ఈ మెగా హీరో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా కైరా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే.

- Advertisement -