‘ఎన్టీఆర్’కు భారీ ఆఫర్..

241
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ప్రఖ్యత నటుడు ఎన్‌ టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలైపోయింది. మరో వైపున ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన పాత్రలకిగాను నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.

NTR Biopic

ఇప్పటికే బసవతారకం పాత్రకి గాను విద్యాబాలన్ ను .. నాగిరెడ్డి పాత్రకి గాను ప్రకాశ్ రాజ్ ను .. బీఏ సుబ్బారావు పాత్రకి గాను సీనియర్ నరేశ్ ను ఎంపిక చేశారు. టాలీవుడ్‌లో పలువురు అగ్ర కథానాయకుల్ని `ఎన్టీఆర్`లో భాగం చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట బాలయ్య. ఈ ప్రాజెక్టులోకి క్రిష్ రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.

అయితే ఈ మూవీలో పాత్రలు పెరిగిపోతూ ఉండటంతో అంచనాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక ఈ విషయం బిజినెస్ పై ప్రభావం చూపుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 12 కోట్లను ఆఫర్ చేసినట్టుగా సమాచారం. ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం కావడంతో,సంగీతం విషయంలో కీరవాణి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -