- Advertisement -
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెగా హీరో గడ్డం, మీసాలు పెంచి తీసుకున్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. ముఖానికి ఎడమవైపు మాత్రమే కనపడేలా ఆయన తీసుకున్న ఈ ఫొటో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని పాత్రలోనిదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సాధ్యమైనంత గొప్పగా ఉండండంటూ అంటూ చరణ్ ఈ సందర్భంగా ఫోటోకు కామెంట్ పెట్టాడు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన ఈ సినిమాలోని వీడియో ఇప్పటికే విడులైంది. అచ్చం అందులోని పాత్రలాగే చెర్రీ పోస్ట్ చేసిన ఈ ఫొటో కూడా ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో కొంత కాలంగా ఆయన ఇంట్లోనే గడుపుతోన్న విషయం తెలిసిందే. చరణ్ ఈ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
- Advertisement -