అమరావతిపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

58
ramdas

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమరావతి రైతులకు మద్దతు పలికారు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే. అమరావతి రైతుల డిమాండ్ న్యాయమైందని తెలిపిన ఆయన వారికి మద్దతు పలికారు.

అమరావతి జేఏసీ నేతలు గురువారం తనని కలవగా వారికి మద్దతు ప్రకటించారు అథవాలే. ఈ అంశంపై ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాస్తానని తెలిపారు. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని వెల్లడించారు.

అమరావతికి జాతీయ నేతల మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు రైతు జేఏసీ నేతలు. ఇప్పటికే పలువురు ఎంపీలను కలిసి మద్దతు కోరారు.