మెగా అభిమానులు శ్రద్దగా ఫాలోయ్ అయ్యే సెలబ్రిటీలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ముందు వరసలో ఉంటారు. చరణ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఉపాసన. చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు కాబట్టి ఆ బాధ్యత ఉపాసన తీసుకుంటుంది.
అయితే ఉపాసన చరణ్ భార్యగానే కాకుండా ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ ను నడిపే వ్యక్తిగా.. అపోలో ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ హెల్త్ విషయంలోజాగ్రత్తగా ఉండడం.. పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకునే అంశాలపై ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది ఉపాసన. మరి ఇలా సొసైటీలో పాజిటివ్ చేంజ్ కోసం పరితంపించే వ్యక్తికి దానికి తగిన గుర్తింపు దక్కకుండా ఎలా ఉంటుంది? తాజాగా ఉపాసనకు ఒక అవార్డును ప్రదానం చేశారు.
శనివారం ముంబయిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఉపాసన ఫిలాన్‌త్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కు స్పందనగా రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా “డియరెస్ట్ ఉప్సి.. నిన్ను చూసి చాలా గర్విస్తున్నాను. దాదాసాహెబ్ ఫాల్కే -ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు.” అంటూ అభినందించాడు.
ఈ అవార్డు అందుకున్న సందర్భంగా ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘చాలా సంతోషంగా ఉంది. సోషల్‌మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూ, నన్ను మోటివేట్ చేస్తున్నవారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటూ మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.