షూటింగ్‌లో గాయపడ్డ రాంచరణ్‌…!

243
Ram charan in rangasthalam shooting location
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంగస్థలం 1985 అనే టైటిల్‌ని ఖరారు చేశారు.  మొన్నటివరకు మండుటెండల్లో గోదావరి జిల్లాలో షూటింగ్‌ జరిగింది. అయితే తీవ్ర ఎండల నేపథ్యంలో షూటింగ్‌కి గ్యాప్‌ ఇచ్చిన చిత్రయూనిట్ తాజాగా రెగ్యులర్ షూటింగ్‌లో బిజీగా ఉంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్య టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల మూవీ షూటింగ్‌లో రాంచరణ్‌ గాయపడ్డారని సమాచారం. గాయాలు స్వల్పమైనవే కావడంతోపాటు ఈ షెడ్యూల్‌ని త్వరితగతిన ముగించాల్సి వుండటంతో చెర్రీ ఆ గాయాలని లెక్కచేయకుండా షూటింగ్‌కి హాజరవుతున్నాడట.

Ram charan in rangasthalam shooting location
రాజమండ్రికి సమీపంలో గోదావరి తీర ప్రాంతంలో వున్న ఓ మారుమూల పల్లెటూరిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే చరణ్ షూటింగ్ స్పాట్‌లో అభిమానుల తాకిడి ఎక్కువగా వుంది. ఏ మాత్రం వీలు చిక్కినా అభిమానులు చెర్రీని చుట్టుముట్టేస్తున్న సందర్భాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో చెర్రీకి గాయాలయ్యాయని తెలిస్తే, ఆ ఆందోళనతో అభిమానులు మరింత మంది షూటింగ్ స్పాట్‌ని చుట్టుముడుతారనే కారణంతోనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు టాక్.

మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జ‌న‌వ‌రి 30న‌ ప్రారంభమైంది. రాంచరణ్ పక్కా విలేజ్ గెటప్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్న ఈ మూవీలో చరణ్‌కి జోడీగా సమంత, రాశీఖన్నా నటిస్తున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా, అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా  అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -