రామ్ చరణ్ సరికొత్త రికార్డు..

173
Ram Charan
- Advertisement -

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ మీడియం అనేది అందరికీ తెలిసిందే. ఇక సినిమా వాళ్లకి అయితే చెప్పేక్కర్లేదు. వీటిని చక్కగా వినియోగించుకుంటున్న వాళ్లలో సినీ తారలు ముందుంటారు. తమ కొత్త చిత్రాల విశేషాలను, షూటింగు కబుర్లను, వ్యక్తిగత వివరాలను ఫొటోలతో సహా పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ వుంటారు.

ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ ట్విట్టర్‌లో తాజాగా ఓ రికార్డు కొట్టాడు. అతితక్కువ కాలంలో మిలియన్ (పది లక్షలు) ఫాలోవర్లను సాధించిన టాలీవుడ్ స్టార్ గా చరణ్ రికార్డు నెలకొల్పాడు. ఈయన కేవలం 233 రోజుల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఖాతాలో 1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

మరి మిగిలిన హీరోలు ఈ మార్క్ చేరుకోడానికి ఎంత సమయం తీసుకున్నారు..? రామ్ చరణ్ తర్వాత స్థానంలో ఎవరున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..

  1. రామ్ చరణ్: చేరిన ఏడాది 2020 మార్చ్..
    పట్టిన సమయం 233 రోజులు
    ప్రస్తుత ఫాలోయర్స్ 1 మిలియన్..
  2. అల్లు అర్జున్:
    చేరిన ఏడాది 2015 ఎప్రిల్..
    పట్టిన సమయం 587 రోజులు
    ప్రస్తుత ఫాలోయర్స్ 5.3 మిలియన్..
  3. పవన్ కళ్యాణ్:
    చేరిన ఏడాది 2014 ఆగస్ట్..
    పట్టిన సమయం 834 రోజులు
    ప్రస్తుత ఫాలోయర్స్ 4.1 మిలియన్..
  4. మహేష్ బాబు:
    చేరిన ఏడాది 2010..
    పట్టిన సమయం 1697 రోజులు
    ప్రస్తుత ఫాలోయర్స్ 10.1 మిలియన్..
  5. జూనియర్ ఎన్టీఆర్:
    చేరిన ఏడాది 2009..
    పట్టిన సమయం 2837 రోజులు
    ప్రస్తుత ఫాలోయర్స్ 4.6 మిలియన్..
- Advertisement -