అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోన్న రకుల్‌

89
- Advertisement -

సినిమా హీరోయిన్లు, సెలెబ్రిటీలు సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నారో తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో నిత్యం ఫోటోలు షేర్‌ చేస్తూ… పుల్‌ బిజీ బిజీగా ఉంటున్నారనే చెప్పొచ్చు. సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరు తమ పర్సనల్‌, ప్రోఫెషనల్‌ వియాలను షేర్‌ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫోటోలను షేర్‌ చేస్తూ… ఫాలోవర్స్‌ ను పెంచుకుంటున్నారు.

తాజాగా టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సైతం షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాను ఊపుతున్నాయి. ఇప్పుడు నెట్టింట రకుల్‌ అందాలు చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. మైండ్‌ బ్లోయింగ్‌ స్టిల్స్‌ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. గ్లామర్‌ మెరుపులతో అందాలు ఆరబోస్తూ… ఇంటర్నెట్‌ ను షేక్‌ చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా ఈ భామకు సోషల్‌ మీడియాలో మాత్రం ఫాలోవర్స్‌ గట్టిగానే ఉన్నారని చెప్పొచ్చు. అయితే రకుల్‌ తాజాగా షేర్‌ చేసిన ట్రెడిషనల్‌ ఫోటోలు కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్నాయి. గుక్కతిప్పుకోకుండా చేస్తున్న ఈ ఫోటలకు ఫిదా అవ్వని వారు ఉండరు.

- Advertisement -