సీనియర్ నటుడు బెనర్జీ ప్రధాన పాత్ర లో రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన `రక్తం` చిత్రానికి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేదరింగ్ ఫారిన్ డ్రామా ఫీచర్స్ సెగ్మెంట్ లో (2017) అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో హింసాత్మక మార్గంలోనే నైతిక విలువలు గురించిన చెప్పిన సినిమా ఇది. ఈ సందర్భంగా సినిమాకు అవార్డు రావడం పట్ల ప్రధాన పాత్రధారి బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ, ` నా 36 ఏళ్ల సినిమా కెరీర్ లో జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర ఘట్టం ఇది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు చాలా సంతృప్తిగా ఉంది. మన తెలుగు సినిమా మరోసారి అంతర్జాతీయ స్థాయి కి చేరుకోవడం గొప్ప విషయం. ఈ అవార్డు ఓ గ్రేట్ థింగ్. రక్తంలో మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర దర్శకులు రాజేష్‌కి, నిర్మాత సునీత కృష్ణన్‌కి,సహ నిర్మాత మునిషీ రైజ్ అహ్మద్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాజేష్ గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డు సినిమాలు తెరకెక్కించి కీర్తి ప్రతిష్టలను గడించిన సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 13 అమెరికాలోని ఓహియో హడ్సన్ కన్వెన్షన్ సెంటర్‌లో `రక్తం` చిత్రం ప్రదర్శింబపడుతుంది. అదే రోజు అవార్డు ప్రదానోత్సవం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి దర్శకులు రాజేష్ టచ్ రివర్, నిర్మాత సునీత కృష్ణన్, సహ నిర్మాత మునిషీ రైజ్ అహ్మద్, నేను హాజరవుతున్నాం` అని తెలిపారు.
`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) లో వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న బెరర్జీని, ‘రక్తం` దర్శకుడు రాజేష్ టచ్ రివర్, నిర్మాత సునీత కృష్ణన్, సహ నిర్మాత మునిషీ రైజ్ అహ్మద్‌ను ఈ సందర్భంగా `మా` టీమ్ అంతా అభినందించారు.