డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`. ఈ సినిమా తమిళంలో హిట్ కొట్టిన ‘రాచ్చసన్’కి ఇది రీమేక్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూలై 18న విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ తోనే అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, నాయికగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. ఈ తమిళ రీమేక్ తెలుగులోను హిట్ కొడుతుందేమో చూడాలి మరి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.