హిట్ ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇండస్ట్రీలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హీరో తాజాగా రాక్షసుడిగా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా రాక్షసుడుతో బెల్లంకొండ శ్రీనివాస్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…
కథ:
దర్శకుడు కావాలనేది అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) కల. ఎప్పటికైనా ఓ మంచి సినిమా చేయాలని కలకంటాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడి కల నెరవేరదు. దీంతో ఇంట్లో వారి ఒత్తిడి భరించలేక ఉద్యోగానికి అప్లై చేయగా ఎస్సై గా సెలక్టవుతాడు. ఉద్యోగంలో చేరగానే స్కూలుకి వెళ్లే బాలికల వరుస హత్యలు సవాల్‌గా నిలుస్తాయి. సీన్ కట్ చేస్తే తన కోడలు కూడా హత్యకి గురవడం,సస్పెండ్ అవుతాడు..? దీంతో ఈ హత్యల వెనక ఉన్న సైకోని అరుణ్ ఎలా కనిపెట్టాడు..? చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథనం, బెల్లంకొండ శ్రీనివాస్ నటన,సంగీతం, థ్రిల్లింగ్ అంశాలు. గత సినిమాతో పోలిస్తే తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఎస్సై పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అనుపమ పరమేశ్వరన్ సినిమాకి గ్లామర్ తెచ్చిన పరిమిత పాత్రలో మాత్రమే కనిపించింది. మిగితానటీనటుల్లో రాజీవ్ కనకాల, కాశీ విశ్వనాథ్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ సెకండాఫ్. ద్వితియార్థం సుదీర్ఘంగా సాగడం ప్రేక్షకులకు బోర్ అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. దర్శకుడు రమేష్ వర్మ కథపై ఆద్యంతం పట్టుని ప్రదర్శించారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ సంగీతం సినిమాకు హైలైట్. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
వరుస ఫ్లాప్‌లతో డీలా పడ్డా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో చేసిన సినిమా రాక్షసుడు. ఒక్క ఆధారం కూడా దొరక్కుండా, అత్యంత పాశవికంగా హత్యలకి పాల్పడే ఓ సైకో ఉదంతంపై పోలీసు పరిశోధన ఎలా సాగిందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ఈ సినిమా. తమిళంలో విజయవంతమైన రాచ్చసన్‌కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో థ్రిల్ ఇచ్చే మూవీ రాక్షసుడు.
విడుదల తేదీ:02/08/2019
రేటింగ్:3/5
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్
సంగీతం: జిబ్రాన్
నిర్మాణం: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేష్ వర్మ