ప్రేమానురాగాలకు ప్రతీక ‘రాఖీ పండగ’

480
rakhi 2020
- Advertisement -

రాఖీ..అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. తోబుట్టువుకి ఎల్లవేళలా రక్షణగా ఉంటానని భరోసా ఇచ్చే పండగ రాఖీ పండగ. అక్కా అని తమ్ముడు ఆప్యాయంగా పిలిచినా, అన్నా అని చెల్లి ప్రేమగా పలకరించినా ఆ పలకరింపుల్లో మమతల పరిమళాలు గుబాళించి గుండె గుండెను అనురాగ జలధిలో ఓలలాడిస్తాయి.

ఏటా శ్రావణ పౌర్ణమినాడు సోదర భావం వెన్నెలలా వెల్లివిరిస్తూ ఆప్యాయతల ఆనంద గీతికలను పల్లవిస్తూ వస్తుందీ వేడుక.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకొనే ఈ పండుగ వచ్చిందంటే.. ఆడపడుచులు తమ సోదరులకు రక్షా బంధనం కట్టాలని చూస్తారు. మెట్టింటి నుంచి పుట్టింటికి చేరుకుని అన్నాతమ్ముళ్లతో ఎంతో సంతోషంగా ప్రేమ, ఆప్యాయతల్ని పంచుకుంటారు.

దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా రక్షా బంధన్‌ను జరుపుకొంటారు. సోదరసోదరీమణుల మధ్య గల అనుబంధాన్ని చాటుకునేందుకు రక్షా బంధన్‌ చక్కటి వేడుక. చెల్లెల్లు తమ అన్నయ్యలు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యలకు రాఖీ కడుతారు. రాఖీ అంటే రక్షా బంధం.

ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఆడపడుచులు, మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి నిలువెత్తు నిదర్శనమే ఈ రాఖీ పర్వదినం. రక్షాబంధనం సందర్భంగా పాఠకులకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది www.greattelngaana.com.

- Advertisement -