లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో ఈ నెల 20 నేటి నుంచి కొన్ని సర్వీసులకు మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విధులకు హాజరయ్యారు రాజ్యసభ ఉద్యోగులు. లిఫ్ట్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగులు విధిగా సామాజిక దూరం పాటించారు. ఈ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన ఎంపీ సంతోష్..ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.
ఇక దేశవ్యాప్తంగా టోల్ చార్జీల వసూళ్లు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్రం ఆదేశాల మేరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో టోల్ ప్లాజాలను తెరచి వసూళ్లు ప్రారంభించింది.
Setting the standards by #RajyaSabha Employees, as they are waiting for the lift maintaining Social Distance. #SocialDistanacing #ProtectYourself#LockdownToKnockdownCovid19 pic.twitter.com/lmuZB10ZQP
— Santosh Kumar J (@MPsantoshtrs) April 20, 2020