కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా పాకిస్థాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశాన్ని రక్షించుకునేందుకు మరోసారి గీత దాటేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. 24వ కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కార్గిల్ యుద్ధస్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్…దేశ గౌరవప్రతిష్ఠల కోసం నియంత్రణ రేఖ దాటడానికైనా సైన్యం సిద్ధమని ప్రకటించారు. కుట్రలకు తెగబడితే బదులిచ్చేందుకు వెనుకాడబోమని…సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Also Read:కేంద్రాన్ని తూర్పారబట్టిన సుప్రీం..
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. యుద్ధం వచ్చిన ప్రతీసారి, యుద్ధ వాతావరణం నెలకొన్నపుడు ప్రజలు సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు భారత్ కట్టుబడి ఉందని.. అందుకే అప్పుడు నియంత్రణ రేఖను దాటలేదని వెల్లడించారు. కానీ అవసరమైతే భవిష్యత్తులో ఎల్‌ఓసీని దాటుతామని వెల్లడించారు.
Also Read:ఏమిటో.. ?ఈ దైవాంశ సంభూతుడు!