లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ నాశ‌న‌మైంది…

355
rahul gandhi
- Advertisement -

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్ధితులపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఎండీ రాజీవ్‌ బజాజ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా కరోనా లాంటి కష్టాన్ని మొదటిసారిగా చూశామని రాజీవ్‌ బజాజ్ పేర్కొన్నారు. మన దేశంలో కరోనా నియంత్రణను, వాస్తవాలను, నిజా నిజాలను ప్రచారం చేయడంలో కాస్త వెనకబడి ఉన్నామని రాజీవ్‌ బజాజ్ పేర్కొన్నారు.

వైర‌స్ సంక్ర‌మించ‌డం అంటే చావ‌డ‌మే అ‌న్న భ‌యాన్ని ప్ర‌జ‌ల్లో నింపామని ఇది చాలా ప్రమాదకరం.. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మే అన్నారు. వైరస్ సమస్యను పరిష్కరించలేదు కానీ… ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని అభిప్రాయపడ్డారు రాజీవ్ బజాజ్. ఆర్థిక వ్యవస్థ ఇంతలా దిగజారడానికి వైరస్ కారణం కాదు…. జీడీపీతో ఏర్పడ్డ వక్రత అని రాజీవ్‌ బజాజ్ పేర్కొన్నారు.

- Advertisement -