2.O.. రిలీజ్‌కు ముందే రికార్డుల మోత..

259
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం 2.O. రజనీ సరసన కథానాయికగా ఎమీ జాక్సన్ నటిస్తోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ దాదాపు 500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో నిర్మించింది. 3డీ ఫార్మాట్‌లో ప్రపంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

Rajinikanth

ఈ చిత్రం రిలీజ్‌కి ముందే ప‌లు రికార్డులు బ్రేక్ చేస్తుంది. సంచ‌ల‌నాలు సృష్టించిన ‘బాహుబలి ది కంక్లూజన్‌’ని ప్రపంచ వ్యాప్తంగా 6,500 థియేటర్లలో విడుదల చేయగా… ‘2.0’ను 6,800 థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్‌లో జరిగినట్టుగా సమాచారం. రజనీకాంత్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన తొలి సినిమా ఇదే కాగా, ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా కూడా ఇదేనని అంటున్నారు.

వివిధ హక్కుల రూపంలో ఇప్పటికే ఈ సినిమా 370 కోట్లు రాబట్టినట్టుగా చెబుతున్నారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతోన్న ఈ సినిమా, ఓపెనింగ్స్ పరంగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -