తమిళనాట తలైవాకు విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళంలోనే కాదు భారతదేశం, ఆగ్నేసియా దేశంలోని ప్రజలకు రజినీకాంత్ అంటే పిచ్చి. కానీ అలాంటి వ్యక్తి కూడా ఒకరికి రుణపడి ఉన్నారంటే మీరు నమ్ముతారా…! అవును ఇది నిజం. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న తలైవా… ఆవిషయాన్ని చెప్పుకొచ్చాడు. నా భార్య వల్లే నేను క్రమశిక్షణ నేర్చుకున్నానని అన్నారు.
నా భార్య లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్‌కు రుణపడి ఉంటానని అన్నారు. బస్ కండక్టర్‌గా చేస్తున్న రోజులో విపరీతంగా తాగేవాడిని మరియు సిగరెట్లు కూడా లెక్కలేకుండా తాగేవాడిని అని అన్నారు. అంతేకాదు ప్రతి రోజూ మాంసాహారం తినేవాడిని అని అన్నారు. ఈ మూడు మంచి అలవాట్లకు బానిసలైన వాళ్లు కొంతకాలం తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరన్నది నా అభిప్రాయం.
నా భార్య లత తన ప్రేమతో నన్ను ఎంతో మార్చివేసందన్నారు. ఆమె వల్ల ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్న అని అన్నారు. అందుకే నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటానని తెలిపారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో తన భార్య లత గురించి ఎన్నో వేదికలపై పంచుకున్న రజనీ…తాజాగా మరోసారి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న 169వ సినిమాగా జైలర్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…