చిన్న సినిమాగా మొదలైన కన్నడనాట భారీ విజయం నమోదు చేసుకున్న కాంతార. పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. సెప్టెంబర్30న విడుదలై…అక్టోబర్ 15నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించారు. రిషబ్‌శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.350కోట్లను వసూలు చేసింది.
కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోన్న ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలనే కాకుండా సెలబ్రిటీలను సైతం మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కూడా మెస్మరైజ్ చేయించిన ఈసినిమా…తాజాగా చిత్రబృందంను ఇంటికి ఆహ్వానించి రిషబ్శెట్టికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టు సినీ విశ్లేషకులు రమేశ్ బాల తెలిపారు. గోల్డ్ చైన్, లాకెట్‌ను బహుమతిగా అందించినట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..