సౌదీలో తొలి భారతీయ సినిమా..?

171
- Advertisement -

ముస్లిం దేశమైన సౌదీ అరేబియా ఈ ఏడాది నుంచి సినిమా థియేటర్లను ఏర్పాటు చేయనుంది. 1980లలో సౌదీలో పెద్ద ఎత్తున ఇస్లామిక్‌ పునరుద్ధరణ ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ అక్కడ అన్ని థియేటర్లను మూసివేశారు. ప్రస్తుతం ఆ దేశంలో ఒకే ఒక్క సినిమా హాల్‌ ఉంది. అది ఖోబార్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌. అందులోనూ అన్ని సినిమాలను ప్రదర్శించరు. కేవలం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని డాక్యుమెంటరీల కోసమే దాన్ని ఏర్పాటుచేశారు.

Rajinikanth 2.0 Movie Release in Saudi Arabia

అయితే అక్కడ ఇప్పుడు థియేటర్లు ఏర్పాటు చేశాక విడుదలయ్యే తొలి సినిమా మన భారతీయ చిత్రం కావడం విశేషం. ఆ సినిమా మరేదోకాదు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’. దాదాపు 35 ఏళ్ల తర్వాత అక్కడ థియేటర్లను తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది సౌదీ ప్రభుత్వం. ఈ ఏడాది మార్చిలో తొలి సినిమా థియేటర్‌ను ప్రారంభించే అవకాశముందని సౌదీ మంత్రి ఒకరు తెలిపారు. ఇక తమిళ న్యూఇయర్‌ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో కలిపి దాదాపు 15 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

- Advertisement -