ఐపీఎల్ 2022: టాస్ గెలిచిన రాజస్థాన్

141
RR vs GT
- Advertisement -

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గురువారం ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఉత్కంఠరేపే మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ గాయంతో ఈ మ్యాచుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జేమ్స్ నీషమ్ ను జట్టులోకి తీసుకుంది. ఇక, గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. విజయ్ శంకర్, యష్ దయాల్ .. సాయి సుదర్శన్, దర్శన్ నల్క్ండే ల స్థానాల్లో జట్టులోకి వచ్చారు.

టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లు చెరో 4 మ్యాచ్ లు ఆడి, 3 విజయాలు సాధించాయి. మెరుగైన రన్ రేట్ తో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో ప్రథమస్థానానికి ఎగబాకుతుంది.

తుది జట్లు :

రాజస్థాన్ రాయల్స్ : జాస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్), రస్సీ వాన్ డర్ డస్సెన్, షిమ్రోన్ హెట్మెయిర్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్, కుల్దీప్ సేన్.

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, మాథ్యూవేడ్ , విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తేవటియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యష్ దయాల్.

- Advertisement -