భారీ రేటుకు ఐపీఎల్ మీడియా రైట్స్‌..

61
ipl
- Advertisement -

సోమవారం ముంబై వేదికగా ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ కోసం బీసీసీఐ ఈ-వేలంలో నిర్వహించింది. దీని కోసం జియో, స్టార్, సోనీ తదితర దిగ్గజ కంపెనీలో పోటీపడ్డాయి. ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్నది. భారత ఉప ఖండంలో టీవీ హక్కులను ప్యాకేజీ ఏ కింద.. భారత ఉప ఖండంలో డిజిటల్ ప్రసార హక్కులను ప్యాకేజీ బీ కింద.. 18 నాన్ ఎక్స్ క్లూజివ్ మ్యాచ్ ల హక్కులను ప్యాకేజీ సీ కింద.. విదేశీ టీవీ, డిజిటల్ రైట్స్ ను ప్యాకేజీ డీ కింద వర్గీకరించింది. ఈ-వేలంలో టీవీ మరియు డిజిటల్ రైట్స్‌లను 44,075 కోట్ల రూపాయలకు రెండు బ్రాడ్‌‌కాస్టింగ్ సంస్థలు దక్కించుకున్నాయి.

వీటిలో ప్యాకేజ్ ఏ అంటే టీవీ ప్రసార హక్కులను సోనీ సంస్థ రూ.23, 575 కోట్లకు దక్కించుకోగా.. భారత ఉపఖండం వరకూ డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్18 సంస్థ రూ.20,500 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో మొత్తం ఈ రెండు హక్కులకు కలిపి ఏకంగా 44, 075 కోట్ల రూపాయలు బీసీసీఐకు అందాయి. 2023 నుంచి 2027 వరకు మొత్తం ఐదేళ్ల కాలానికి నిర్వహించిన ఈ వేలంలో రెండు ప్యాకేజీలకు కలిపి బేస్ ధరను 33,340 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది.

ఈ రెండింటినీ కలిపి చూస్తే ఒక్కో మ్యాచ్ రూ.105.5 కోట్లు పలికింది. ప్యాకేజీ సీ, డీ ఇంకా ఆరంభించనేలేదు. ఈ నాలుగు ప్యాకేజీలకూ కలిపి (గతంలో ఒక్కటిగానే ప్యాకేజీ) ఒక్కో మ్యాచ్ కు స్టార్ ఇండియా ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం రూ.54.5 కోట్లుగానే ఉండడం గమనించాలి. ప్యాకేజీ ఏ కింద రూ.23,575 కోట్లకు గాను ఒక్కో మ్యాచ్ కు రూ.57.5 కోట్లు బిడ్డింగ్ చేసినట్టు అయింది. డిజిటల్ రైట్స్ రూ.19,680 కోట్లు పలకడంతో.. ఒక్కో మ్యాచ్ కు రూ.48 కోట్లు బిడ్డింగ్ దాఖలైంది. విజేతలు ఎవరన్నది బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -