- Advertisement -
తనకు ఎలాంటి పదవి వద్దన్న సచిన్ పైలట్.. అవి వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. ప్రజల విశ్వాసాన్ని, మనపై వారి నమ్మకాన్ని బలోపేతం చేసే దిశలో మనం పనిచేయాలని సూచించారు.
రాజస్ధాన్ సంక్షోభం, రాహుల్ – ప్రియాంకతో భేటీ అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన సచిన్…రాజకీయాల్లో దుర్మార్గానికి లేదా వ్యక్తిగత శత్రుత్వానికి చోటు లేదన్నారు. తమ మనోవేదనను రాహుల్- ప్రియాంక ఓపికగా విన్నారని…వాటిని పరిష్కరించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. తాము లేవనెత్తిన సమస్యలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
- Advertisement -