యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఈ ముగ్గురి పేర్లు తప్ప మరొకరి పేరు బయటకు రాలేదు. ఇటీవల ‘భారీ మల్టీస్టారర్ షురూ అయింది’ అంటూ రాజమౌళి..రామారావు..రామ్‌చరణ్ ఆంగ్ల పేర్లలో మొదటి అక్షరం ‘R’ వచ్చేలా #RRR పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియోను పంచుకున్నారు. ఇప్పుడు ఈ మూడు ‘R’లలో మరో ‘R’ చేరబోతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి విలన్ పేరు బయటకు వచ్చింది. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గరుడవేగ సినిమా సమయంలో తాను విలన్‌గా నటించడానికైనా సిద్ధమని రాజశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తన సినిమాలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్‌ను రాజమౌళి సంప్రదించినట్టు సినివర్గాల సమాచారం.
ఇప్పటికే క్రియేట్ చేసిన ‘#RRR’లో రాజశేఖర్ విలన్ పాత్రలో నటించేది నిజమైతే మరో ‘R’ వచ్చి చేరుతుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇదిలావుండగా.. తారక్, చరణ్ పాత్రలకు సంబంధించి ఇటీవల అమెరికాలో ఒ ఫొటో షూట్ చేశారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. ఇప్పుడు హీరోయిన్ల వేట కూడా సాగుతోందని తెలుస్తోంది.