మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’. రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథులుగా హాజరయ్యారు రజనీకాంత్, కమల్ హాసన్.
ఈ సందర్భంగా మాట్లాడిన రజనీ…ఈ కథలో వంతియాతివన్ పాత్రకు నేను సరిపోతానని అప్పట్లో జయలలిత చెప్పారు. జయలలిత చెప్పారని నేను పొన్నియన్ సెల్వన్ పుస్తకం చదివాను. ఇందులోని నందిని పాత్ర నా నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్రకు స్ఫూర్తి. గతంలోనే నేను, కమల్ హాసన్, శ్రీదేవి, విజయ్ కాంత్‌లు కలిసి ఈ సినిమా తీయాలని అనుకున్నాం. కానీ కుదర్లేదు అన్నారు. ఇప్పుడు మణిరత్నం తీస్తున్నాడని తెలిసి ఈ సినిమాలో నటించాలి అనుకోని చిన్న పాత్రైనా సరే ఇవ్వమని మణిరత్నంను అడిగాను. కానీ మణిరత్నం ఇవ్వలేదన్నారు.
ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.