వరుస విజయాలతో టాలీవుడ్లో నెం.1 డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఈ దర్శకధీరుడు…. ప్రస్తుతం బాహుబలి 2వ పార్టును విజయవంతంగా పూర్తిచేశాడు. ఈ సందర్భంగా ఓ ఛానల్‌తో తన మనసులోని మాటలను పంచుకున్న రాజమౌళి..పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
మహాభారతం సినిమా తీయాలన్నదే తన లక్ష్యమని రాజమౌళి స్పష్టం చేశాడు. సినిమా బాగుంటే ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా వీక్షిస్తారని….ప్రేక్షకులను బాహుబలి లోకంలోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతోనే చాలా ఇష్టపడి ఈ సినిమాను చేసినట్లు చెప్పారు. అమర చిత్ర కథల నుంచే తను ప్రేరణ పొందేవాడినని ఈ క్రియేటివ్ డైరెక్టర్ అన్నారు.
బాహుబలికంటే ముందు ఈగ చిత్రం చేయడం తనకు ఎంతో ఉపకరించిందని రాజమౌళి అన్నారు. సినిమా అవుట్ పుట్ సరిగ్గా వచ్చేందుకు ఎక్కడా రాజీ పడలేదని జక్కన్న చెప్పాడు. చిత్ర యూనిట్ అందించిన సహకారం మరువలేనిదని చెప్పాడు. బాహుబలి-1 బాహుబలి -2కు మొత్తం రూ.450 కోట్లు నిర్మాణ వ్యయం అయినట్లు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో కూడా ఈ స్థాయి భారీ బడ్జెట్ సినిమా రాలేదని శోభు చెప్పారు.
ఇదిఇలా ఉండగా రాజమౌళి మహాభారతం తీస్తే అందులో తప్పకుండా నటిస్తానని తెలిపాడు. అంతేగాదు మహాభారతంలో శ్రీకృష్ణుడిని పాత్రను ఎంచుకుంటానని…వాస్తవానికి తనకు కర్ణుడి పాత్ర ఇంకా ఇష్టమని కానీ, కర్ణుడు ఆరడుగుల ఆజానుబాహుడు కాబట్టి తాను ఆ పాత్రకు సూటవనని చెప్పాడు అమీర్ చెప్పిన సంగతి తెలిసందే.