ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో….పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ

87
Pawan Kalyan Fans Ruckus at K150 Event

ఖైదీ నెంబర్‌150 ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ అనుకున్నదాని కంటే గ్రాండ్‌గా సక్సెస్‌ అయ్యింది. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో మెగా అభిమానులు రావడంతో వారిని కంట్రోల్‌ చేయడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు. ఈ వేడుకల్లో పవన్‌ కళ్యాణ్ అభిమానులు నానా హంగామా చేశారు. జనసేన జెండలు పట్టుకుని వచ్చి పవన్ అభిమానులు రచ్చచేశారు.

Pawan Kalyan Fans Ruckus at K150 Event

ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు పవన్‌కు తల్లి లాంటి సురేఖ (చిరంజీవి భార్య) ను పంపించి ఆహ్వానించిన కూడా రాకపోవడంపై మెగా హీరోలు కొంత నిరుత్సాహానికి గురి చేసింది. ఆడియో వేడుకల్లో మెగా ఫ్యామిలిలో ఎవరు మాట్లాడిన పవన్‌ పేరు రాకుండ ప్రస్తావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎక్కువ సేపు వేడుక కొనసాగిస్తే పవన్‌ అభిమానులతో సమస్య వస్తుందని ముందే ఉహించి ఫంక్షన్‌ హడావిడిగా పూరి చేశారు.

Pawan Kalyan Fans Ruckus at K150 Event

అయితే ఫంక్షన్‌ పూర్తయ్యాక అక్కడున్న కుర్చీలను నాశనం చేస్తూ…స్టేజ్‌పై ఉన్నవారిని తిడుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో హాల్‌చల్‌ చేస్తుంది. పవన్‌ పేరును ప్రస్తావించకుండా ఫంక్షన్‌ ముగియడంపై పవన్‌ అభిమానులు జీర్ణించుకొలేక ఈ పని చేసినట్టు తెలుస్తొంది. ఇక అల్లుఅర్జున్‌ ఫోటోలకు పోజులు ఇస్తున్నప్పుడు అక్కడున్న పవన్‌ అభిమానులు పవర్‌స్టార్‌ పవర్‌స్టార్‌ అంటూ నినాదాలు చేసి ఇబ్బంది పెట్టారు బన్నీని. ఇతర ఫంక్షన్‌లోనే కాకుండా మెగా ఆడియో ఫంక్షన్స్‌లో కూడా పవన్‌ ఫ్యాన్స్‌ పవర్‌స్టార్‌ నినాదాలతో ఇబ్బంది పెడుతుండడంతో అందరినీ కాస్త అనహనానికి గురిచేస్తొంది.

ట్విటర్‌ వేదిక పవన్‌ కళ్యాన్‌ ఖైదీనెంబర్‌150 హిట్‌ కావలని, ఇందులో నటించిన నటీనటులకు టెక్నిషియన్లుకు నా ధన్యవాదలు. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్‌లో బిజీగా ఉండే ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు రాలేకపోతున్నాను అని ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.