రాజమౌళి రెమ్యునరేషన్…

285
Rajamouli Remuneration for Baahubali
Rajamouli Remuneration for Baahubali
- Advertisement -

బాహుబ‌లి-2.. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు తిర‌గ‌రాస్తోంది. విడుద‌ల‌యిన ప్ర‌తీ చోటా త‌న‌దైన మార్కుతో స‌రికొత్త చ‌రిత్రను న‌మోదు చేస్తోంది. టాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ.. బాహుబ‌లి మానియాకు ప్రాంత బేధం లేకుండా.. బాలీవుడ్.. కోలీవుడ్.. మాలీవుడ్‌.. ఇలా ఏ వుడ్‌లతో సంబంధం లేకుండా… అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, ర‌జనీ కాంత్..ల రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం ఇదే తొలిసార‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బాహుబలి కలెక్షన్ల మాట అటుంచితే.. రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు ఐదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్న రాజమౌళి ఈ సినిమా కోసం అహర్నిషలు పనిచేశారు.

SS Rajamouli Baahubali 2 Film to Break Another Record

రెండు భాగాల వల్ల వచ్చిన లాభాల్లో రాజమౌళికి మూడో వంతు వాటాగా ఇవ్వనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ఐదేళ్ల పాటు రాజమౌళికి సంబంధించిన పర్సనల్ ఖర్చులన్నీ నిర్మాతలే భరించినట్లు సమాచారం. కాగా, బాహుబలి 1,2 పార్టులు కలిపి ఎంత లాభాలు వచ్చాయనేది అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. బాహుబలి:ది బిగినింగ్‌ రూ. 600 కోట్లు వసూలు చేసినప్పటికీ.. తమకు లాభాలు రాలేదన్నది నిర్మాతల మాట. బాహుబలి 2 తోనే తమకు లాభాలు వస్తాయని వారు కూడా తెలిపారు. అయితే సినిమా రెండు భాగాలు కలిపి రూ. 450 కోట్లు ఖర్చైనట్టు నిర్మాత శోభు బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు. ఇక ఒక్క పార్ట్ 2 ప్రి రిలీజ్ బిజినెస్సే రూ. 438 కోట్ల వరకు జరిగింది. ఎవరికెంత వాటా అన్నది బాక్సాఫీసు బిజినెస్ పూర్తయిన తర్వాత లాభాలు ఎన్ని కోట్లు అనేది తేలనుంది.

- Advertisement -