బాహుబలిని చెక్కిన జక్కన్న ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ని సోంతం చేసుకున్నాడు. బాహుబలితో భలా..అనిపించిన ఈ దర్శకధీరుడు రాజమౌళి సిని ఇండస్ట్రీలో ఇప్పుడో ఐకాన్. బాహుబలితో ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ తన వైపు చూసేలా చేసుకున్న రాజమౌళి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కి ఫిక్స్ అయిపోయాడు.
అయితే ఈనెల 28 బాహుబలి పార్ట్ 2 ద కంక్లూజన్ కూడా రిలీజ్ చేయబోతున్నాడు జక్కన్న. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా మరోసారి రికార్డులను తిరగరాస్తుందనే నమ్మకం దాదాపు అన్ని వర్గాల్లోనూ ఉంది.
ఇక ఇదిలా ఉంటే…బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారు సిని లవర్స్. అయితే సడన్ గా జక్కన్న షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. దీంతో జక్కన్న తీసుకున్న ఆ డెసిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ..రాజమౌళి ఇక చిన్న సినిమాలకు, చిన్నాచితకా హీరోలకు దొరకడని, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ మీదే ఆయన దృష్టి ఉంటుందని అందరూ అనుకున్న టైంలో, జక్కన్న ఇచ్చిన ట్విస్ట్ కి అందరూ షాక్ తిన్నారు.
అయితే జక్కన్న తీసుకున్న ఆ షాకింగ్ నిర్ణయమే..చిన్న సినిమాలు తీయాలనుకోవడం. అవును…’మర్యాదరామన్న’ తరహాలో చిన్న సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడట జక్కన్న. అందుకే ‘బాహుబలి’ కోసం కొన్నేళ్ల పాటు శ్రమించిన జక్కన్న.. తన నెక్ట్స్ సినిమాను విజువల్ వండర్‌గా కాకుండా.. రియల్ సీన్లతోనే రిచ్‌గా తీయాలన్న ప్లానింగ్ లో ఉన్నాడట.
అసలు ఇలాంటి నిర్ణయాన్ని రాజమౌళి ఎందుకు తీసుకున్నాడా అని ఫ్యాన్సంతా బుర్ర బద్దలుకొట్టుకుంటున్న టైంలో.. తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇదే బెటరని జక్కన్న డిసైడయ్యాడని తెలుస్తోంది. మొత్తానికి ‘బాహుబలి’ లో ప్రభాస్, రానాలున్నా…జక్కన్న నే బాహుబలిగా ఊహించుకునే ఫ్యాన్స్‌కి ఇదో షాకింగ్ న్యూసే అనుకోవాలి.