అవార్డు కోసం డబ్బులివ్వలేదు !

120
akshay-kumars-national-award-win
akshay-kumars-national-award-win

రుస్తుం చిత్రంలో అద్భుత నటనకు గానూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఎప్పుడో రావాల్సిన అవార్డు ఇప్పుడు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాను అవార్డుల కోసం ఎవరికీ డబ్బులివ్వలేదని, ఎవరినీ మోసం చేయలేదని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించాడు. ఇండియాకు సంబంధించినంత వరకూ నేషనల్ ఫిల్మ్ అవార్డు చాలా ప్రతిష్ఠాకరమైనదని, దీన్ని అందుకోవడం తనకెంతో ప్రత్యేకమని అన్నారు. గతంలో అవార్డు ప్రదర్శన కార్యక్రమాల్లో డ్యాన్స్ లు చేస్తే, సగం డబ్బిచ్చి, మిగతా సగానికి అవార్డులు ఇస్తామని చెబుతుండేవారని, తాను మాత్రం ఎన్నడూ అందుకు అంగీకరించలేదని అన్నాడు.

ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేశారన్న వార్త తొలుత విన్నప్పుడు ఏప్రిల్ ఫూల్ జోక్ గా భావించానని చెప్పాడు. అవార్డు తనకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఈ అవార్డు తనకు రావాలని ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఇంత కాలానికి నెరవేరిందని అన్నాడు. అయినా అభిమానుల ప్రేమ ముందు అవార్డులు చిన్నవని చెప్పాడు. ఇటీవల కాలంలో అద్భుతమైన చిత్రాలతో అక్షయ్ కుమార్ ఉత్తమ నటనను ప్రదర్శిస్తున్నాడు. ఇటీవల విడుదలైన జాలీ ఎల్ఎల్బీ2 చిత్రం విమర్శల ప్రశంసలు అందుకొన్నది. అయతే జాతీయ అవార్డుల ఎంపిక జ్యూరీ అధ్యక్షుడి స్థానంలో దర్శకుడు ప్రియదర్శన్ ఉండటమే ఇప్పుడు ఇలాంటి కామెంట్లకు ఆస్కారం ఇస్తోంది. అక్షయ్ కు ప్రియదర్శన్ బాగా సన్నిహితుడు.. ఆ సాన్నిహిత్యమే ఈ అవార్డుకు కారణం అనే కామెంట్ చేస్తున్నారు కొంతమంది.

akshay-priyadarshan-759