ఆ స్టార్‌ సినిమాని రిజెక్ట్ చేసింది..

142
Alia Bhatt turned down Aamir Khan's Thugs of Hindostan

అలియాభట్ బాలీవుడ్ లో అడుగుపెట్టిన కొద్ది కాలానికే తన నటనతో ఆడియెన్స్ ని ఫిదాచేసేసింది. ఇప్పటికి కూడా అలియా హీరోయిన్‌ గా సక్సెస్‌ ట్రాక్ దూసుకుపోతోంది. అయితే అలియాభట్‌ మొదటి నుండి కూడా కథకు, తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలకే ఫిక్స్‌ అయింది.రీసెంట్ గా ‘డియర్ జిందగీ’ సినిమాలో షారూఖ్ తో  రొమాన్స్‌ చేసిన ఈ బ్యూటీ కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించింది.
 Alia Bhatt turned down Aamir Khan's Thugs of Hindostan
దీంతో ఈ అమ్మడికి తెగ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇదే క్రమంలో అలియాకి మరో క్రేజీ ఆఫర్‌ వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆ ఆఫర్‌ కి నో చెప్పేసింది ఈ బాలీవుడ్‌ బ్యూటీ. ఆదిత్య చోప్రా, అమీర్ ఖాన్ తో ప్లాన్ చేస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాలో హీరోయిన్ గా నటించమని అలియాను సంప్రదించారు. కథ మొత్తం విన్న ఈ బ్యూటీ ఆ తర్వాత అందులో చేయనని తెగేసి చెప్పేసిందట.
 Alia Bhatt turned down Aamir Khan's Thugs of Hindostan
అలియా నో చెప్పడానికి కారణం సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడమే అని తెలుస్తోంది. అయితే మొదట ఈ సినిమాను హృతిక్ తో చేయాలనుకున్నారు.

కానీ హృతిక్ కూడా హీరోయిన్ పాత్రను మరింత డెవలప్ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చాడట. కానీ ఇప్పుడు హీరోనే మారిపోయాడు. ఏదేమైనా ఇప్పుడు హీరోయిన్‌ పాత్ర నిడివి మరింత పెంచితే కానీ హీరోయిన్ దొరికేలా లేదంటూ..బాలీవుడ్‌ టాక్‌‌.