‘రాజావిక్రమార్క’ సినిమా రివ్యూ..

627
- Advertisement -

టాలీవుడ్‌లో హీరో కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈమూవీ ఈ రోజు థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమాతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారు? అసలు ఆ సినిమాలో ప్రేక్షకుల్ని అలరించే అంశాలేంటి? అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.

కథ: విక్రమ్ (కార్తికేయ) ఎన్ఐఏలో కొత్తగా చేరిన ఉద్యోగి. తన సుపీరియర్ ఆఫీసర్ మహేంద్ర (తనికెళ్ళభరణి)ని బాబాయ్ అనేంతగా అతడికి ఆయన దగ్గర చనువుంటుంది. హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని అక్రమ ఆయుధాలు సరఫరా చేసే నైజీరియన్‌ను ఎన్ఐఏ బృందం పట్టుకుంటుంది. అతడిని విచారించే క్రమంలో విక్రమ్ చేతిలో ఉన్న గన్ పొరపాటున పేలి అతడు చనిపోతాడు. అయితే మరణించే ముందు మాజీ నక్సలైట్ నాయకుడు గురునారాయణ (పశుపతి)ని చూశానని చెబుతాడు. అతడి వల్ల హోమ్ మినిస్టర్ చక్రవర్తి (సాయికుమార్)కి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? వారిద్దరి మధ్య గతంలో ఉన్న శత్రుత్వానికి కారణమేంటి? గురు నారాయణ ను ఎన్ఐఏ ఎలా అడ్డుకుంది? విక్రమ్‌కి, హోమ్ మినిస్టర్ కూతురు కాంతి(తాన్యా రవిచంద్రన్) కి మధ్య రిలేషన్ ఏంటి? చక్రవర్తిని కాపాడే క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్‌: కార్తికేయ తనదైన శైలిలో మంచి ఈజ్‌తో, గత చిత్రాల్లోని డిక్షన్‌తో మెప్పించారు. ఒక సన్నివేశంలో అతడు సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తారు. అలాగే, అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుంది. కథానాయికగా తాన్యా రవిచంద్రన్ ఆకట్టుకుంటుంది. గురునారాయణగా పశుపతి, హోమ్ మినిస్టర్‌గా సాయికుమార్, యన్.ఐ.ఏ చీఫ్‌గా తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌: దర్శకుడు శ్రీ. కథ నడిపే విధానం పూర్తిగా సిరీయస్‌గా చూపించి ఉంటే.. బాగానే ఉండేది. ఫస్టాఫ్ పూర్తిగా కార్తికేయ కామెడీ సీన్స్ తో ఎంగేజ్ చేసి.. ఇంటర్వెల్ దగ్గర ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తిని క్రియేట్ చేశారు దర్శకుడు. కొన్ని మలుపులతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే కాస్తంత రేసీగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలు ఇదివరకు కొన్ని సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం: టెక్నికల్ సినిమా బాగుంది. పీసీ మౌళి సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ విహారి సంగీతం హైలైట్‌గా నిలుస్తాయి. మొత్తం మీద రాజావిక్రమార్కలో కొన్ని రొటీన్ సన్నివేశాలున్నప్పటికీ.. యన్.ఐ.ఏ బ్యాక్ డ్రాప్‌లో తీయడం వల్ల.. ఇన్వెస్టిగేషన్, ట్విస్ట్స్ ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తాయి.

తీర్పు: మొత్తం మీద రాజావిక్రమార్క రొటీన్‌గా అనిపించినా.. ఇన్వెస్టిగేషన్, ట్విస్ట్స్‌లతో ప్రేక్షకుల్ని మెప్పించాడు.

విడుదల తేదీ : 12, నవంబర్ 2021
రేటింగ్-2.5
నటీనటులు : కార్తికేయ, తాన్యా రవిచంద్రన్
సంగీతం : ప్రశాంత్ ఆర్.విహారి
నిర్మాత : రామారెడ్ది
దర్శకత్వం : శ్రీ సరిపల్లి

- Advertisement -