రాజా ది గ్రేట్…సెన్సార్ పూర్తి

220
Raja The Great gets u/a
- Advertisement -

మాస్‌ మహరాజా రవితేజ చాలాకాలం ‘రాజా ది గ్రేట్’ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా  ప్రమోషన్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించనుండటంతో సినిమా పోస్టర్‌ దగ్గరి నుంచి టీజర్,ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘రాజా ది గ్రేట్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  సెన్సార్ నుంచి U/A  సర్టిఫికేట్ లభించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ నాయికగా నటించింది.ఇవాళ సాయంత్రం రాజా ది గ్రేట్ ప్రి రిలీజ్‌ ఫంక్షన్ జరగనుంది.

దాదాపు రెండేళ్ల తర్వాత రవితేజ రాజాది గ్రేట్‌గా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ‘బెంగాల టైగర్’ ఫ్లాప్‌తో డీలా పడ్డా రవి… ఈ సినిమాతో తన కెరీర్‌ మళ్లీ గాడిలో పడుతుందనే విశ్వాసంతో ఉన్నాడు. సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాతగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు  ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా ఉండటంతో సినిమా హిట్ కొట్టినట్లేనని అంతా భావిస్తున్నారు.

- Advertisement -