ఇంజినీర్ బాబుగా పవన్..?

318
pawan kalyan - trivikram srinivas
- Advertisement -

కాటమరాయుడు చేదు అనుభవం తర్వాత పవన్ కల్యాణ్ తీస్తున్న తాజా చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. పవన్ హీరోయిజం, త్రివిక్రమ్ మాటల మంత్రజాలపు మ్యాజిక్ రెండూ కలిపి తీసిన అత్తారింటిది దారేదీ సినిమా టాలివుడ్‌కి కలెక్షన్ల పరంగా కొత్త దారి చూపించింది. అత్తారింటికి దారేది’ తర్వాత పవన్, త్రివిక్రమ్‌ కలసి చేస్తున్న చిత్రమిది. హారిక హాసిని బ్యాన‌ర్‌పై కె.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

 -pawan-kalyan-trivikram-srinivas-movie-

ప‌వ‌న్-త్రివిక్ర‌మ్ కాంబో ఇదివ‌ర‌కే హిట్‌. జ‌ల్సా, అత్తారింటికి దారేదీ.. ఈ రెండు సినిమాలూ ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాయి. అత్తారింటికి దారేది సినిమాలో లో నదియా పవన్‌కు అత్తగా నటిస్తే… ఈ సినిమాలో ఖుష్బూ అత్త పాత్ర చేస్తున్నారు. అత్తారిల్లులో మేనత్తను తాతయ్యకు దగ్గర చేసే ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్‌ చేసిన హీరో పాత్రలో పవన్‌ కనిపించారు. ఈ సినిమాలో ఏం ప్రాజెక్ట్‌ టేకప్‌ చేస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్. అయితే ఈ సినిమాలో పవన్ పాత్రపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Pawan-Kalyan-and-Trivikram

పవన్ ఈ మూవీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తున్నాడని పలువురు చెబుతుండగా, మరికొందరు కాలేజీ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి టైటిల్ ను కూడా ఖరారు చేయలేదు.. అయితే అజ్ఞాతవాసి, దేవుడే దిగివచ్చిన, పరదేసి ప్రయాణం, మాధవుడు, గోకుల … ష్ణుడు, ఇంజనీరింగ్ బాబు వంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిలో చిత్ర యూనిట్ దేనిని పైనల్ చేస్తుందో చూడాలి. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు.

- Advertisement -