రాజ్‌భవన్‌లో 48 మందికి కరోనా…

186
rajbhavan
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజుకు 25 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండగా తెలంగాణలో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచడంతో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు టెస్టులు చేయించుకునేందుకు ముందుకువస్తుండగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

ఇక తెలంగాణ రాజ్ భవన్ కార్యాలయంలోని సిబ్బందికి, గవర్నర్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాజ్ భవన్ లో పనిచేస్తున్న సిబ్బందిలో 48 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా గవర్నర్ తమిళిసై కు కరోనా నెగెటివ్ వచ్చినట్టు రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి.

- Advertisement -